ప్రమాదం తగ్గలేదు జాగ్రత్తలు అవసరం

ABN , First Publish Date - 2020-10-22T11:06:43+05:30 IST

ప్రమాదం తగ్గలేదు జాగ్రత్తలు అవసరం

ప్రమాదం తగ్గలేదు జాగ్రత్తలు అవసరం

అవగాహన ర్యాలీ చేపట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులు


బద్వేలు, అక్టోబరు 21: కరోనా మహమ్మారి ఇంకా వీడిపోలేదని, ఇప్పుడే మరింత జాగ్రత్త అవసరమని అధికారులు ప్రజల్లో అవగాహన చేపట్టారు. వైద్య, పోలీసు, మున్సిపల్‌, మండల అభివృద్ధి అధికారులు గ్రామీణుల్లో సైతం అవగాహన కల్పించారు. ఇందు లో భాగంగా బద్వేలు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్‌ సీఐ రమే్‌షబాబు, డాక్టర్‌ చంద్రహాసరెడ్డి, డాక్టర్‌ వాసుదేవరెడ్డి, వైసీపీ నేతలు బంగారు శీనయ్య,  సింగసాని శివయ్య, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మరో కార్య క్రమంలో కరోనా నిబంధనలపై  ఎంపీడీఓ రామకృష్ణ గ్రామ కార్యదర్శులకు సూచించారు.  


కలసపాడు: కలసపాడులో పంచాయతీ సెక్రటరీ జగన్‌మోహన్‌ ఆధ్వర్యంలో మాస్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాస్కులు లేని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కరోనా తొలగిపోలేదని, చలికాలంలో మరింతగా విజృంభించే అవకాశం ఉందన్నారు. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.


పోరుమామిళ్ల: కరోనా నియంత్రణకు మాస్కే కవచమని ఎస్‌ఐ మోహన్‌, ఎంపీడీఓ నూర్జహాన్‌, టేకూరుపేట పాధ్రమిక వైద్యాధికారి వెంకటేశ్వర్లు. ఈఓపీఆర్‌డీ రమణారెడ్డి అన్నారు. పోరుమామిళ్లలో మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ అఽధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల పంచాయతీ కార్యదర్శి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


చాపాడు, : మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం కరోనా వైరస్‌పై అధికారులు ర్యాలీ నిర్వహించారు. వెదురూరు, విశ్వనాథపురం, చాపాడు, అన్నవరం, లక్ష్మిపేట, పల్లవోలు, తదితర గ్రామాల్లో  ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీ డీఓ శ్రీధర్‌నాయుడు, ఈఓపీఆర్‌డీ, గ్రామ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


దువ్వూరు,  :కరోనా వ్యాధిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వైద్యులు కిరణ్‌కుమార్‌, సమీర పేర్కొన్నారు. కరోనా వ్యాధిపై అవగాహన కలిగించేందుకు విద్యార్థులతో వైద్యసిబ్బంది గొడుగుల ర్యాలీ నిర్వహించారు.  పండుగ సమయాల్లో జనసమూహం లేకుండా, మా స్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నా రు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. 


బ్రహ్మంగారిమఠం: పలుగురాళ్లపల్లె పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కరోనా వ్యాధిపై ర్యాలీ చేప ట్టారు. వైద్యాధికారి చెన్నకేశవరావు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ మాస్కులపై అవగాహన కలిగించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


సామాజిక దూరంతోనే కరోనాను నివారించవచ్చని ఎంపీడీఓ వెంగమునిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బి.మఠం కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో వెలుగు సీసీ కె.భాస్కర్‌, ఏపీఓ వసంతకుమార్‌, సచివాలయ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.


పులివెందుల టౌన్‌: ప్రజలంతా నిబంధనలు పాటించి కరోనాను తరిమిగొట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో భాగంగా బుధవారం పట్ట ణంలోని పూలంగళ్ల సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీ సులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


పులివెందుల రూరల్‌: కొవిడ్‌ -19 వ్యాప్తిని అడ్డుకునేందుకు మా స్కే కవచమని మండల వైద్యాధికారి శర ణ్య పేర్కొన్నారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశావర్క ర్లు, వైద్యసిబ్బందిచే ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.   పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ సతీష్‌ పాల్గొన్నారు.


సింహాద్రిపురం: కరోనా వ్యాప్తి నియంత్రణకు అంతా భాగస్వాము లు కావాలని ఎంపీడీఓ కృష్ణమూర్తి, డాక్టర్‌ నాగస్వప్న పిలుపునిచ్చారు. సింహాద్రిపురం లో కొవిడ్‌-19పై ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ర్యాలీ చేశారు.


వేముల: వేములలో కొవిడ్‌ -19 నేపథ్యంలో మాస్కే కవచం అంటూ ర్యా లీ నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైరస్‌ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. 


వేంపల్లె: ప్రజలంతా కరో నా పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని డాక్టర్‌ స్వాతి సాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కరో నాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వ హించారు. వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T11:06:43+05:30 IST