సూపరింటెండెంట్‌పై ఆర్‌జేడీ ఆగ్రహం..!

ABN , First Publish Date - 2020-10-22T10:42:36+05:30 IST

సూపరింటెండెంట్‌పై ఆర్‌జేడీ ఆగ్రహం..!

సూపరింటెండెంట్‌పై ఆర్‌జేడీ ఆగ్రహం..!

నీపై నిత్యం ఫిర్యాదులేనంటూ అసహనం..

సమీక్షలోనే మండిపాటు..


అనంతపురం విద్య, అక్టోబరు 21: జిల్లా విద్యాశాఖ సూపరింటెండెం ట్‌ జగదీ్‌షపై పాఠశాల విద్య కడప ఆర్‌జేడీ వెంకటకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన సమగ్రశిక్ష కార్యాలయంలో డీఈఓ శామ్యూల్‌తో కలసి జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ, నాడు-నేడు పనులు, డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ, మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి, ఇంటర్‌ సీట్ల భర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. తర్వాత డీఈఓ కార్యాలయంలో ఏడీలు, సూపరింటెండెంట్లు, క్లర్కు ల వారీగా వారు చూస్తున్న సబ్జెక్టులను ఆరాతీశారు. డీఈఓ పూల్‌లో ఎంతమంది తెలుగు పండితులున్నారు..? ఉర్దూ ఎంత మంది ఉన్నారని ఆర్‌జేడీ ఆరాతీశారు. తెలుగు పండితులు 80, ఉర్దూ ఐదుగురు డీఈఓ పూల్‌లో ఉన్నారని సూపరింటెండెంట్‌ చెప్పారు. రెండు రోజుల కిందట ఎంత మంది స్కూల్‌ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులిచ్చారు? పోస్టులు ఎక్కడివి? మూడింటిలో రెండే ఎందుకు భర్తీ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీపై ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయం’టూ సూపరింటెండెంట్‌ జగదీ్‌షపై మండిపడ్డారు. ఏ ప్రశ్న వేసినా స్పందించట్లేదనీ, క నీసం వచ్చిన వారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా వ్యవహరించటం సబబు కాదన్నారు. నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయనీ, పద్ధతి మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సూపరింటెండెంట్ల సీట్లు మారుస్తామన్నారు. సమావేశంలో ఏడీలు రవూఫ్‌, దేవరాజ్‌, కృష్ణ య్య, నాగరాజు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-22T10:42:36+05:30 IST