భారీ వర్షం..!

ABN , First Publish Date - 2020-10-22T10:40:36+05:30 IST

భారీ వర్షం..!

భారీ వర్షం..!

1846 హెక్టార్లలో రూ.2.17 కోట్ల విలువైన పంట నష్టం 


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 21:  అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవా రం భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడింది. యాడికి, నం బులపూలకుంట, యల్లనూరు తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గార్లదిన్నె తదితర మండలాల్లో ఓ మోస్తారు వర్షపాతం పడింది. బొమ్మనహాళ్‌, పెద్దవడుగూరు, హిందూపురం, పెనుకొండ, లేపాక్షి, గుడిబండ తదితర మండలాల్లో చిరుజల్లులు నేలరాలాయి. మంగళవారం రాత్రి 59 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురంలో 75.6మి.మీ., డి.హీరేహాళ్‌ 58.4, బొమ్మనహాళ్‌ 48.0, యాడికి 39.0, తాడిపత్రి 41.6, కుందుర్పి 37.6, ఆత్మకూరు 42.2, పుట్లూరు 61.2, యల్లనూరు 50.0, కనగానపల్లి 32.4, సీకేపల్లి 43.4, ముదిగుబ్బ 50.4, తలుపుల 71.2, ఎన్‌పీకుంట, సోమందేపల్లి 32.2, గాండ్లపెంట 41.0, కదిరి 31.0, చిలమత్తూరు 33.6, లేపాక్షి 44.2 మి.మీ., వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 28.2 మి.మీ., పడింది. ఈనెల జిల్లా సరాసరి వర్షపాతం 110.7 మి.మీ., కాగా ఇప్పటిదాకా 96.1 మి.మీ., నమోదైంది.


రూ.2.17 కోట్ల విలువైన పంట నష్టం 

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఖరీ్‌ఫలో సాగు చేసిన వేరుశనగ పంట కోత సమయంలో వర్షం పడటంతో పొలంలోనే పంటంతా తడిసిపోయింది. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెలారంభం నుంచి ఇప్పటిదాకా 1846 హెక్టార్లలో రూ.2.17 కోట్లకుపైగా విలువైన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో  1520 హెక్టార్లలో రూ.1.80 కోట్ల విలువైన వేరుశనగ పంట నష్టం వాటిల్లింది.

Updated Date - 2020-10-22T10:40:36+05:30 IST