వర్షంతో నీట మునిగిన పంటలు

ABN , First Publish Date - 2020-10-22T10:38:16+05:30 IST

వర్షంతో నీట మునిగిన పంటలు

వర్షంతో నీట మునిగిన పంటలు

ఉరవకొండ/బొమ్మనహాళ్‌/యాడికి/యల్లనూరు, అక్టోబరు 21: అకాల వర్షం రైతును నిలువునా ముంచింది. పంటపొలాల్లో నీరు నిండి చెరువును తలపిస్తున్నారు. ఉరవకొండ మండలంలోని నెరమెట్లలో మొక్కజొన్న, బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌, బండూరు, లింగదహాళ్‌, కొళగానహళ్లి, ఏళంజి గ్రామాల్లో మొక్కజొన్న, పత్తి, మిరప, యాడికిలో వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరులో కురిసిన భారీ వర్షానికి పప్పుశనగ రైతు నిలువునా నష్టపోతున్నాడు. కొంతమంది పప్పుశనగ పంట ను రెండు, మూడురోజుల క్రితం విత్తుకున్నారు. అధిక వర్షాలతో మొలక రావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు నష్టపోయిన పంటపొలాలను పరిశీలించాలని కోరుతున్నారు. ఎరతెరిపి లేని వర్షంతో వేరుశనగ పంట కొందరు తొలగించగా, మరికొంతమంది అలాగే ఉంచుకున్నారు. ఉన్నకాయలు మొలకలు వస్తున్నాయని వాపోతున్నారు. 

Updated Date - 2020-10-22T10:38:16+05:30 IST