Abn logo
Sep 21 2020 @ 06:11AM

మెట్లపై నుంచి జారిపడి కూలీ మృతి

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 20 : ఒంగోలునగర పాలక సంస్థలో దినసరి కూలీగా పనిచేసే నాగతోటి ప్రసాద్‌ (48) ఆదివారం మృతి చెందాడు. స్థానిక ఎన్‌టీఆర్‌కాలనీ 4వలైనులో నివాసం ఉండే ప్రసాద్‌ తెల్లవారుజామున తన ఇంటి మెట్లపై నుంచి దిగుతూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్సని మిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement