Abn logo
Sep 21 2020 @ 06:10AM

ముగిసిన బీజేపీ సేవాసప్తాహం

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 20 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన సేవాసప్తాహం వేడుకలు ఆదివారంతో ముగిశాయి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెగ్గం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20వ డివిజన్‌ లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం చర్చిసెంటర్‌లో ప్లాస్టిక్‌ వాడకం నిషేధించాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులు బొద్దులూరి ఆంజనేయులు, డి.శివాజీ, ధనిశెట్టి రాము, కొల్లా శ్రీను, కొలా వాసు, పేర్ల సుబ్బారావు, రత్తయ్య, పూర్ణ పాల్గొన్నారు. కాగా చెరువుకోమ్ముపాలెం ఎస్సీకాలనీలో బీజేపీ నాయకులు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. తాటిపర్తి రాఘవయ్య ఆధ్వర్యంలో జరి గిన కార్యక్రమంలో కొమ్మ శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, రాయపాటి అజయ్‌కుమార్‌, కేసిన రమేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement