Abn logo
Sep 21 2020 @ 06:11AM

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చైర్మన్‌ చర్యలు

ఒంగోలు (కార్పొరేషన్‌) సెప్టెంబరు 20 : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించే అన్య మతస్తులు డిక్లరేషన్‌పై సంతకం చేయా ల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ. సు బ్బారెడ్డి వ్యాఖ్యానించడం తిరుమల తిరుపతి దే వస్థానం నిబంధనలు ఉల్లంఘించడమే కాకుం డా ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అని టీడీపీ నాయకులు విమర్శించారు. ఆదివారం ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కా ర్యాల యంలో ఏర్టాటు చేసిన విలేఖరుల సమా వేశం లో ఆ పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాస రా వు, కొఠారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్‌ భూ ష ణ్‌లు మాట్లాడారు. హిందూ దేవాలయాల్లో కొ న్ని సంప్రదాయాలు, అనాదిగా కొనసాగుతున్నా యని చెప్పారు. శబరిమలైలో చొక్కా లేకుండా నే అయ్యప్పస్వామిని, మంత్రాలయంలో రా ఘ వేంద్ర స్వామిని లేకుండా దర్శించుకోవాలని తెలి పారు. బ్రిటీష్‌ కాలం నుంచి తిరుమల దేవస్థా నంలో అన్యమతస్తులు వేంకటేశ్వరస్వామిని ద ర్శించుకునేందుకు డిక్లరేషన్‌ ఇచ్చే సంప్రదాయం ఉందని, దానిని చైర్మన్‌ ఉల్లంఘిస్తూ చర్యలు చే పట్టడం సరైంది కాదని విమర్శించారు. ఇప్పటి కైనా హిందువుల మనోభావాలు దెబ్బతిసే పద్ధ తులు విడాలని వారు హితవు పలికారు.

Advertisement
Advertisement
Advertisement