వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలి’

ABN , First Publish Date - 2020-09-21T10:40:56+05:30 IST

వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలి’

వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలి’

విజయనగరం రింగురోడ్డు: కేంద్ర సర్కార్‌ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌ కోరారు. ఆదివారం స్థానిక తోటపాలెంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌ వ్యవ సాయ బిల్లుతో వ్యవసాయం రంగం కుదేలవుతుందని, దీనిని ప్రజలు వ్యతి రేకించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. మరోవైపు దళితులపై దాడులు జరుగుతున్నా, పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టు ఎన్ని మొట్టికాయులు పెట్టినా నిర్ణయాలు మార్చుకోవడం లేదని, ప్రజలే బుద్ధి  చెబుతారని తెలిపారు.  సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి  ఆదినారాయణ, అధ్యక్షుడు సతీష్‌,  సీపీఐ, లోక్‌ సత్తా పార్టీ , మైనార్టీ సంఘం, ఆమ్‌ ఆద్మీ, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T10:40:56+05:30 IST