Abn logo
Sep 21 2020 @ 04:47AM

ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు

నెల్లూరు (జడ్పీ), సెప్టెంబరు 20:  గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షలకు 20,236 మంది అభ్యర్థులకు గాను 14,735 మంది హాజరయ్యారు. 5,501మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షకు 72.81శాతం మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 14,318మందికిగాను 10,425మంది హాజరయ్యారు. 3,893 మంది గైర్హాజరయ్యారు. ఈ సెషన్‌లోనూ 72.81శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. కరోనా బాధితులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయగా ఎనిమిది మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. కాగా, ఆత్మకూరులోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 138 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని  చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement