అంగన్‌వాడీల ఇంటర్వ్యూల రద్దు

ABN , First Publish Date - 2020-09-21T10:17:30+05:30 IST

అంగన్‌వాడీల ఇంటర్వ్యూల రద్దు

అంగన్‌వాడీల ఇంటర్వ్యూల రద్దు

నెల్లూరు (వీఆర్సీ) సెప్టెంబరు 20 : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పోస్టుల ఇంటర్వ్యూలను హైకోర్టు  ఉత్తర్వుల మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ సుధాభారతి తెలిపారు. కోవూరు ప్రాజెక్టు  పరిధిలోని విడవలూరు మండలం జాన్‌పేట, దంపూరు, ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని అనంతసాగరం మండలం పీడీపల్లి, ఉదయగిరి ప్రాజెక్టు పరిధిలోని వరికుంటపాడు మండలం వేంపాడు మెయిన్‌, బుచ్చి ప్రాజెక్టు పరిధిలోని దగదర్తి మండలంలోని దగదర్తి (హెచ్‌డబ్ల్యూ) కేంద్రాల కార్యకర్తల పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు  ఆమె తెలిపారు.ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

Updated Date - 2020-09-21T10:17:30+05:30 IST