పేద రైతులకు ఉచిత బోర్లు

ABN , First Publish Date - 2020-09-21T10:16:15+05:30 IST

పేద రైతులకు ఉచిత బోర్లు

పేద రైతులకు ఉచిత బోర్లు

నెల్లూరు (జడ్పీ), సెప్టెంబరు 20:  వైఎస్‌ఆర్‌ జలసిరి పథకం ద్వారా జిల్లాలోని సన్న,చిన్నకారు రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తుందని, ఈ పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల28న ప్రారంభిస్తారని డ్వామా పీడీ సాంబశివారెడ్డి తెలిపారు. డ్వామా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డెల్టాలో రెండున్నర ఎకరాలు, మెట్టలో ఐదుఎకరాలు కలిగిన రైతులకు  ఉచితంగా బోర్లు వేస్తామన్నారు.అర్హులైన రైతులు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోర్లు ఏర్పాటుకు నియోజకవర్గానికి ఒక రిగ్గు మిషన్‌ను ప్రభుత్వం కేటాయించిం టదన్నారు. 


ఉపాధి పనిదినాల్లో ప్రథమస్థానం

ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో కూలీలకు పనిదినాలు కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందని పీడి తెలిపారు. 2020-21 సంవత్సరానికి 88లక్షల పనిదినాలను కల్పించాల్సి ఉందని చెప్పారు. అందులో ఇప్పటికే 74లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 76లక్షల పనిదినాలు కల్పించి లక్ష్యాన్ని అధిగమించామని చెప్పారు. ఈ ఏడాదికి ప్రభుత్వం కేటాయించిన 88లక్షల పనిదినాలకు బదులు 1.10కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మార్చి 31 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. 

Updated Date - 2020-09-21T10:16:15+05:30 IST