నేటి నుంచి అప్పన్న ఆర్జిత సేవలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-09-21T10:03:38+05:30 IST

నేటి నుంచి అప్పన్న ఆర్జిత సేవలు పునఃప్రారంభం

నేటి నుంచి అప్పన్న ఆర్జిత సేవలు పునఃప్రారంభం

సింహాచలం, సెప్టెంబరు 20: కరోనా కారణంగా మార్చి 20 నుంచి నిలిపివేసిన ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, లక్ష్మీనారాయణ వ్రతాలు, స్వాతి నక్షత్ర హోమాలను సోమవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వాండ్ర త్రినాథరావు తెలిపారు. నిత్య కల్యాణం రోజూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు, లక్ష్మీనారాయణ వ్రతాలు రోజూ ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు, ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు స్వాతి హోమాలు జరుగుతాయన్నారు. కరోనా నిబంధనల వల్ల నిత్య కల్యాణంలో రోజుకు పది జంటలకు, లక్ష్మీనారాయణ వ్రతాలను బ్యాచ్‌కు ఎనిమిది మంది చొప్పున ఐదు బ్యాచ్‌లకు కలిపి 40 జంటలకు, స్వాతి నక్షత్ర హోమంలో ఎనిమిది జంటలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవల టికెట్లను కొండదిగువ శ్రీదేవి సత్రంలోని దేవస్థానం ప్రధాన రిజర్వేషన్‌ కార్యాలయంలో విక్రయిస్తారన్నారు. సోమవారం నుంచి స్వామివారి దర్శనాలు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు భక్తులకు లభిస్తాయని ఈవో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-21T10:03:38+05:30 IST