ఆగని చావుకేక

ABN , First Publish Date - 2020-09-21T09:42:36+05:30 IST

ఆగని చావుకేక

ఆగని చావుకేక

- జిల్లాలో కరోనాకు మరో ఏడుగురు బలి

- 446కి పెరిగిన  మరణాలు

- కొత్తగా 539 మందికి పాజిటివ్‌ 


అనంతపురం వైద్యం, సెప్టెంబరు 20 : జిల్లాలో కరోనా చావులు ఆగడం లేదు. తాజాగా మరో ఏడుగురు మృతి చెందినట్టు ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడిం చారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 446కి చేరింది. రా ష్ట్రంలో కరోనా మరణాలలో జిల్లా నాలుగో స్థానంలో కొన సాగుతోంది. కాగా ఒక్కరోజులో జిల్లాలో కొత్తగా 539 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధి తుల సంఖ్య  52837కి పెరిగింది. వీరిలో 49356 మంది కరోనా నుంచి స్వస్థత పొందగా 3035 మంది వివిధ ఆస్ప త్రుల్లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 53 మండలాలలో కొత్త కేసులు నమోదయ్యా యి. జిల్లా కేంద్రంలోనే 154 కేసులు వచ్చాయి, హిందూ పురం 67, ధర్మవరం 34, గోరంట్ల 23, ఎన్‌పీకుంట 22, కదిరి 17, పుట్టపర్తి 15, తాడిపత్రి 13, పెనుకొండ 10, లేపాక్షి, కూడేరు 9, పెద్దవడుగూరు, రొళ్ల, తలుపుల, ఉరవకొండ 8, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కనగానపల్లి, ఓడీసీ 7, సీకేపల్లి, గుత్తి, కొత్తచెరువు, కుందిర్పి, నల్లచె రువు, రాయదుర్గం, సొమందేపల్లి 6, బత్తలపల్లి, చిలమ త్తూరు, గార్లదిన్నె, పుట్లూరు 5, పరిగి 4, ఆత్మకూరు, బీకేఎస్‌, పామిడి, తనకల్లు, విడపనకల్లు 3, గాండ్లపెంట, గుమ్మఘట్ట, కంబదూరు, మడకశిర 2, మరో 13 మండ లాలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు నలుగురున్నారు.  కరోనా కోలుక్ను మరో 539 మందిని ఆదివారం డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.


నేడు కరోనా నమూనాలు సేకరించే ప్రాంతాలివే... 

జిల్లాలో సోమవారం హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, పామిడి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఓడీసీ, అమడగూరు, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, తలుపుల, కురుగుంట, బుక్క రాయసముద్రం, రాప్తాడు, కొర్రపాడు, కూడేరు, ఆత్మకూ రు, ధర్మవరం, సీకేపల్లి, ఎన్‌ఎస్‌గేట్‌, బత్తలపల్లి, కనగాన పల్లి, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి, సోమందేపల్లి, శెట్టూరు, వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, పాతూ రు ఆస్పత్రులలో కరోనా నమూనాలు సేకరిస్తారని  కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-21T09:42:36+05:30 IST