20ఎన్కేపీ1ఎ: వంగలపూడి అనిత హెటెరో కార్మికులకు భద్రత ఏదీ? తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నక్కపల్లి, మే 20: హెటెరో ఔషధ పరిశ్రమలో కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో తరచూ అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడుతూ, ఇటీవల హెటెరోలో జరిగిన ఒక పేలుడు సంఘటనలో రాజవొమ్మంగి గ్రామానికి చెందిన ఒక కార్మికుడు మృతి చెందినప్పటికీ విషయం బయటకు పొక్కనీయలేదన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో అమాయకులైన కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికీ హెటెరో యాజమాన్యం చేస్తున్న హత్యలేనన్నారు. ఇటీవల సంఘటనలో మరణించిన మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెటెరో పరిశ్రమలో సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా మరణిస్తే, మృతదేహాలను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు మాత్రం పెద్దగా ప్రమాదం లేదని చెబుతున్నారన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే హెటెరోలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో యాజమాన్యాలు తిలోదకాలు వదులుతున్నాయని అనిత ఆరోపించారు.
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
నక్కపల్లి, మే 20: హెటెరో ఔషధ పరిశ్రమలో కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో తరచూ అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడుతూ, ఇటీవల హెటెరోలో జరిగిన ఒక పేలుడు సంఘటనలో రాజవొమ్మంగి గ్రామానికి చెందిన ఒక కార్మికుడు మృతి చెందినప్పటికీ విషయం బయటకు పొక్కనీయలేదన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో అమాయకులైన కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికీ హెటెరో యాజమాన్యం చేస్తున్న హత్యలేనన్నారు. ఇటీవల సంఘటనలో మరణించిన మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెటెరో పరిశ్రమలో సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా మరణిస్తే, మృతదేహాలను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు మాత్రం పెద్దగా ప్రమాదం లేదని చెబుతున్నారన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే హెటెరోలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో యాజమాన్యాలు తిలోదకాలు వదులుతున్నాయని అనిత ఆరోపించారు.