డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏవీ.?

ABN , First Publish Date - 2022-07-02T05:09:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆవా జ్‌ యోజన పథకం కింద లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్‌ దానిని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో ఎనిమిదేళ్లయినా పేదలకు ఇవ్వలేదని బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి ఆశీష్‌సూద్‌ అన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏవీ.?
సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ మాజీ కార్యదర్శి ఆశీష్‌ సూత్‌

- ఎనిమిదేళ్లయినా ఉద్యోగాలు ఇయ్యలేదు.. నిరుద్యోగ భృతీ లేదు

- తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌

- బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి ఆశీష్‌సూత్‌


గద్వాల, జూన్‌ 1: కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆవా జ్‌ యోజన పథకం కింద లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్‌ దానిని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో ఎనిమిదేళ్లయినా పేదలకు ఇవ్వలేదని బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి ఆశీష్‌సూద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో వివిధ మోర్చా లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా రైతులు గిట్టబాటు ధరతో ధాన్యం అమ్ముకోవచ్చని బిల్లు తెస్తే కేసీఆర్‌ అడ్డుకొని తక్కవ ధరకు రైతులు అమ్ముకునేవిధంగా చేశాడని విమర్శించారు. పండించిన ధాన్యాన్ని కొన మని కేంద్రం చెబితే రాజకీయాలు చేశాడని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇవ్వలేదు కానీ.. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు రూ.రెండు లక్షలు ఇచ్చాడని విమర్శించారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా చేయలేదని ప్రశ్నించారు. కానీ మోడీ గిట్టుబాటు ధరతో పాటు, ఏడాదికి రూ.6వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాడని గుర్తుచేశారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో దేశంలోని నిరుపేదలందరికీ సం క్షేమ పథకాలు అందిస్తున్నాడని వివరించారు. కానీ కేసీఆర్‌ వాటిని ప్రజలకు అందించకుండా తన ఖాతాలో వేసుకుంటున్నాడని విమర్శించారు. స్వచ్ఛ భారత్‌లో మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవం నిలిపాడని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదు లక్షల ఇండ్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 23లక్షల పక్కా ఇళ్లను నిర్మించామని, తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూమ్‌లు అంటూ ఒక్కరికీ కూడా ఇళ్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద పేద వాడికి రూ.5లక్షల వైధ్య సదుపాయం కల్పిస్తే తెలం గాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని వివ రించారు. కులమతాలకు తావులేకుండా ప్రతీ ఒక్కరికి ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఇచ్చామని తెలిపారు. పేద ప్రజల గురించి ఆలోచించే మోడీ కావాలా, స్వా ర్థంతో కుటుంబం గురించి ఆలోచించే కేసీఆర్‌ కావాలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్‌ ఇం జన్‌ సర్కార్‌ రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించే మోడీ సభను విజయ వంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాంచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శులు డీకే.స్నిగ్దారెడ్డి, రవి ఎక్బోటే, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పాల్వాయి రాముడు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జీఎల్‌. చందు, బీసీ మోర్చా అధ్యక్షులు కబీర్‌దాస్‌ నర్సింహ్మా, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నర్సింహులునాయక్‌ తదితరు లున్నారు.

 తెలంగాణ రాష్ట్రం దివాళా అయింది

  - గయా ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌ 

అలంపూర్‌ : మిగులు నిధులతో ఉన్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల పాలు చేశారని బీజేపీ గయా ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం అలంపూర్‌ చేరుకున్న ప్రేమ్‌కుమార్‌ పట్టణంలోని హరిత హోటల్‌లో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పేరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా కేసీ ఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రూ.లక్ష కోట్ల మిగులు బడ్జెట్‌ను అప్పుల బడ్జెట్‌గా చేసిన కేసీఆర్‌ కుటుంబ ఘనతకు అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆవాజ్‌ యోజన కింద పేద ప్రజలకు ఇళ్లు నిర్మించడానికి ప్రత్యేక పథకాన్ని ఏర్పాటుచేస్తే కేసీఆర్‌ అడ్డుకున్నారన్నారు. ఆయుష్మాన్‌ భవన్‌ కింద రూ.5 లక్షలు పేద ప్రజలకు ప్రభుత్వం అమలుచేస్తే ప్రజలకు అందకుండా మోసం చేసిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలను కేంద్ర నిఽఽధులతో ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనెల 3వ తేదీ నరేంద్రమోదీ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అలంపూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. జోగుళాంబ హాల్ట్‌ నుంచి మోదీ సభకు హాజరయ్మే అభిమానులకు ఉచితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రాజగోపాల్‌, నాయకులు జగదీశ్‌, పట్టణ అధ్యక్షుడు మద్దిలేటి, నరేశ్‌ తదితరులున్నారు.


Updated Date - 2022-07-02T05:09:21+05:30 IST