దారి కోసం ఆందోళన

ABN , First Publish Date - 2021-10-28T04:50:02+05:30 IST

మండల పరిధిలోని పెద్దగోనేహాల్‌ గ్రామ కొట్టాలకు వెళ్లేందుకు దారి చూపాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

దారి కోసం ఆందోళన
గ్రామస్థులు ఆందోళన

హొళగుంద, అక్టోబరు 27: మండల పరిధిలోని పెద్దగోనేహాల్‌ గ్రామ కొట్టాలకు వెళ్లేందుకు దారి చూపాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రోడ్డుపై మహిళలు, చిన్నారులు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్‌ శేషఫణి, ఎంపీడీవో మేరి, ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ విజయకుమార్‌ గ్రామస్థులతో మాట్లాడారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్థులు వినిపించుకోలేదు. తమకు దారి చూపకపోతే పురుగుమందు తాగుతామని హెచ్చరించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి ద్వారా రోడ్డును ఆక్రమించుకున్న పలువురికి నోటీసులు జారీ చేశారు. దీంతో గ్రామస్థులు  ఆందోళన విరమించారు. 


Updated Date - 2021-10-28T04:50:02+05:30 IST