విజయవాడ స్థానికుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2020-04-03T20:31:44+05:30 IST

నగరంలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో

విజయవాడ స్థానికుల్లో ఆందోళన

విజయవాడ: నగరంలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలంటున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే అయినా నిత్యావసర వస్తువులు ఇళ్లకు చేరిస్తే లాక్ డౌన్ గడువు పెంచినా ఇబ్బంది లేదని స్థానికులు అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు కృష్ణాజిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.


ఒక్క విజయవాడ నగరంలో సుమారు 18 కేసులు నమోదయ్యాయి. జగ్గయ్యపేటలో రెండు, నందిగామలో ఒకటి, నూజివీడులో రెండు కేసులు నమోదవ్వడంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కర్ఫ్యూ ఇంకా పొడిగిస్తారా? లేక సడలిస్తారా? అన్నది మీమాంసగా మారింది.

Updated Date - 2020-04-03T20:31:44+05:30 IST