అన్నదాతల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-04-09T05:20:20+05:30 IST

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు జిల్లా అన్నదాతల్లో ఆందోళన నెలకొంటుంది. ఓ వైపు కారు మబ్బులు మూసుకొస్తుండడం, ఆకాశం మబ్బులతో కమ్ముకుపోతుండడంతో అకాల వర్షాలు రైతన్నలను భయపెడుతోంది.

అన్నదాతల్లో ఆందోళన
ఇటీవల ఎల్లారెడ్డిలో కురిసిన అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యం (ఫైల్‌)

జిల్లా రైతులను భయపెడుతున్న కారు మబ్బులు

ఇప్పటికే పలు చోట్ల ప్రారంభమైన వరి కోతలు

మరికొన్ని మండలాల్లో కోత దశకు సిద్ధంగా ఉన్న వరి పంట

అకాల వర్షాలతో జిల్లాలో పలు చోట్ల తడిసిన ధాన్యం

జిల్లాలో పూర్తిగా తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెరుచుకున్నవి 25 కేంద్రాలు.. 250 టన్నుల ధాన్యం కొనుగోలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు జిల్లా అన్నదాతల్లో ఆందోళన నెలకొంటుంది. ఓ వైపు కారు మబ్బులు మూసుకొస్తుండడం, ఆకాశం మబ్బులతో కమ్ముకుపోతుండడంతో అకాల వర్షాలు రైతన్నలను భయపెడుతోంది. ఇప్పటికే వరి పంట చేతికి రాగా మరికొన్ని చోట్ల కోతలు కోసి ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. అకాల వర్షాలు కురిస్తే ఎక్కడ తమ ధాన్యం తడిసిపోయి వర్షానికి కొట్టుకుపోతు ందోనని రైతులు ఆగమాగం అవుతున్నారు. మరోవైపు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం అన్నదాతలను కలవరపెడుతోంది. ఇప్పటికే పలుచోట్ల రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలతో వందల క్వింటాల్లో ధాన్యం తడిసిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా జిల్లాలో 20 కేంద్రాలు మాత్రమే తెరుచుకున్నాయి. అందులోనూ పూర్తిస్థాయి లో ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్‌ వస్తోంది.

ఆకాశాన్ని కమ్మేస్తున్న మబ్బులు

ప్రతీ యాసంగి సీజన్‌లో అకాల, వడగండ్ల వర్షం కురవడం సర్వసాధారణం. సరిగ్గా కోతల సమయంలోనే అకాల వర్షాలు కురుస్తుండడంతో ప్రతీ ఏటా రైతుల ధాన్యం తడిసిపోతుండడం తో నష్టపోతూ వస్తున్నారు. గత నెల రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు చాలానే పెరిగాయి. ఎండలు ముదిరిపోయాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు అయితే ఆకా శాన్ని కారుమబ్బులు కమ్మేస్తుండడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. మూడు రోజుల నుంచి జిల్లాపై కారుమబ్బులు కమ్మేస్తుండడంతో ఎక్కడ అకాల వర్షాలు కురుస్తాయోనని రైతు ల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే గత రెండు రోజుల కిందట ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్‌, జుక్కల్‌ తదితర మండలా ల్లో అకాల వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కురిశాయి. ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల పరిఽధిలో పలు గ్రామాల్లో రైతులు వరి కోతలు కోసి పంట పొలాల్లో, కేంద్రాల వద్ద ధాన్యా న్ని కుప్పలుగా పోసి ఉంచారు. ఈ అకాల వర్షాలకు సుమారు 80 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోవడమే కాకుండా వరద తాకిడికి ధాన్యం కొట్టుకుపోయింది. మరికొన్నిచోట్ల వడగండ్ల వర్షం తాకిడికి వడ్లు రాలిపోయి నేలపాలయ్యాయి.

జిల్లాలో ఊపందుకున్న వరి కోతలు

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి కోతలు ఇప్పుడి ప్పుడే ఊపందుకున్నాయి. గత పది రోజుల కిందటే అక్కడక్కడ రైతులు హర్వేస్టింగ్‌ పెట్టారు. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్‌, దోమకొండ, రామారెడ్డి, బీబీపేట, తాడ్వాయి, సదాశివనగర్‌, గాంధారి తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే వరి పంట చేతికి రావడం కోతలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బీర్కూర్‌, బాన్సువాడ, నస్రూల్లాబాద్‌, బిచ్కుంద, నిజాంసాగర్‌, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో కోతలు కోసి ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. మరికొందరు కొనుగో లు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారు లు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. వరి కోతలు కోసిన వారు టార్పాలీన్‌లను అందుబాటులో ఉంచు కోవాలి. వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి టార్పాలీన్‌లతో కప్పి ఉంచాలని సూచిస్తున్నారు.

కొనుగోళ్లకు ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో కొనుగోళ్లకు పౌర సరఫరాల, సహకార, ఐకేపీ, మార్కెటింగ్‌ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ఇందులో పీఏసీఎస్‌ల ద్వారా 307, ఐకేపీల ద్వారా 21, మార్కెట్‌ యార్డులు 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ యాసంగి సీజన్‌లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్‌కు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868తో కొనుగో లు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు  1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా ఇప్పటికే 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచ నున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకు ండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు సిబ్బ ందిని ఏర్పాటు చేయనున్నారు. ఎండలు మండుతు న్నందున తాగు నీటి వసతి, టెంట్లను అందుబాటు లో ఉంచనున్నారు.

25 కేంద్రాలు ప్రారంభం..250 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలో మొదటగా బాన్సువాడ, బీర్కూర్‌, నస్రు ల్లాబాద్‌, బిచ్కుంద, నిజాంసాగర్‌ తదితర మండలా ల పరిధిలో వరి నాట్లు ముందుగా వేస్తారు. దీంతో కోతలు ఏప్రిల్‌ మొదటి వారంలోనే ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ మండలాల్లో వరి కోతలు ప్రారంభ మయ్యాయి. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో 9 కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేప ట్టారు. ఇప్పటి వరకు 27 మంది రైతుల నుంచి 250 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయి తే పూర్తిస్థాయిలో కొనుగోలు ప్రారంభం కాకపోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, కామారెడ్డి తదితర మండ లాల్లోని వరి కోతలు కోసీ ధాన్యాన్ని కుప్పలుగా పోసీ ఉంచారు. ఈ ప్రాంతాల్లోనూ కేంద్రాలను ప్రారంభిం చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-04-09T05:20:20+05:30 IST