బకాయిల బెంగ

ABN , First Publish Date - 2021-10-15T06:25:07+05:30 IST

నగరపాల క సంస్థకు బకాయిల బెంగ పట్టుకుంది. గత నాలుగేళ్లుగా అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

బకాయిల బెంగ
విద్యుతనగర్‌ నుంచి నవోదయ కాలనీకి వెళ్లే రోడ్డు గుంతలమయం

నగరపాలక సంస్థలో రూ.35 కోట్ల బిల్లులు పెండింగ్‌

పూర్తి కాని ప్రధాన రహదారులు

టెండర్లు పిలిచినా స్పందించని కాంట్రాక్టర్లు

ఐదేళ్లయినా మోక్షం కలగని ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డు


అనంతపురం కార్పొరేషన,అక్టోబరు 14:  నగరపాల క సంస్థకు బకాయిల బెంగ పట్టుకుంది. గత నాలుగేళ్లుగా అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండేళ్లలో ఆ పెండింగ్‌ శాతం మరింత పె రిగింది. నగరంలోని రోడ్లలో గుంతల నుంచి మొదలు కొ ని మధ్యలో నిలిచిపోయిన ప్రధాన రహదారుల వరకు పరిస్థితి అధ్వానంగా తయారైంది. బిల్లుల సమస్యతో అభి వృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. ఏళ్లతరబడి కొన సాగుతున్న కొన్ని రోడ్ల పనులు కనీసం సగం కూడా పూర్తికాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవు తుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు రూ.కోట్ల లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు ఇప్పట్లో పడతాయో లేదో తెలియక కాంట్రాక్టర్లు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు కొత్తగా పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. వీటితో పాటు అనంతపురం కార్పొరేషనకు విద్యుత బిల్లుల బకాయి మరింత తలనొప్పిగా మారింది. రూ.5కోట్ల పైచిలుకు  విద్యుత శాఖకు చెల్లించాల్సి ఉంది. 


రూ.35కోట్లు బిల్లులు పెండింగ్‌

నగరపాలక సంస్థ పరిధిలోని బిల్లుల పెండింగ్‌  అభి వృద్ధిపై ప్రభావం చూపుతోంది. గత ఎనిమిది నెలలకాలం లోనే రూ.35కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.21కోట్లు, జనరల్‌ ఫండ్‌ (జీఎ్‌ఫ)నిధులు రూ.9కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక విద్యుత బిల్లులు ఇతరత్రా రూ.5కోట్లకు పైగా రావాల్సి ఉంది. బ్లాక్‌టా్‌ప(బీటీ), సిమెంట్‌కాంక్రీట్‌(సీసీ), సీసీ డ్రె యిన, పైపులైన పనులతో పాటు పలు అభివృద్ది పనులకు సంబంధించి రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపో యాయి. కొన్ని పనులు 50శాతం మేరకు, మరికొన్ని 75శా తం వరకు పనులు పూర్తి చేసి మధ్యలో నిలిపేశారంటే బిల్లులు ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలుస్తుంది. ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో..? పనులు ఎప్పుడు పూర్తవుతాయో...? ఎవరికీ స్పష్టత లేదు. 


ఏళ్లవుతున్నా ఆ రోడ్లు అలాగే...


నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు చాలా పనులు అ ర్ధంతరంగా నిలిచిపోవడమో, కాంట్రాక్టర్లు పనులు చేయక పోవడమో జరిగింది. ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డు ఐదేళ్లయినా పూర్తి కాకపోవడం గమనార్హం. రూ.9.5కోట్లతో టెండరు పిలిచిన ఈ రోడ్డును మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. టీటీడీ కల్యాణ మం డపం నుంచి సోమనాథ్‌నగర్‌ వరకు నిర్మించాల్సిన రోడ్డు సగం కూడా పూర్తిచేయలేకపోయారు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. ఇక ఆర్టీఓ కార్యాలయం రోడ్డు పరిస్థితి మరింత దారుణం. టెండర్లు పిలిచి నాలుగేళ్లయి నా రోడ్డు మాత్రం పడలేదు. స్మార్ట్‌సిటీతో రోడ్లు నిర్మించి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నా ఆ రోడ్లు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. 


Updated Date - 2021-10-15T06:25:07+05:30 IST