Advertisement

Virat Kohli జన్మదినోత్సవం.. Anushka Sharma ఎమోషనల్ పోస్ట్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు (శుక్రవారం) తన 33వ జన్మదినోత్సవం జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా ద్వారా కోహ్లీకి విషెస్ తెలియజేశారు. కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేసింది. కోహ్లీతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. కోహ్లీ చాలా నిజాయితీపరుడని, ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది. 


`ఈ ఫొటోకు, నీ జీవన విధానానికి ఫిల్టర్ అవసరం లేదు. నిరాశ నుంచి త్వరగా బయటపడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నువ్వు ప్రతిరోజూ అభివృద్ధి చెందుతూనే ఉంటావు. నాకు తెలుసు.. మనం ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునే మనుషులం కాదు. అయితే నువ్వు ఎంత అద్భుతమైన మనిషివో ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంటుంది. నీ మనస్తత్వం గురించి తెలిసిన వ్యక్తులు అదృష్టవంతులు.  ప్రతిదాన్ని మరింత అందంగా చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే` అంటూ అనుష్క విష్ చేసింది. 

Advertisement

Bollywoodమరిన్ని...