Abn logo
Sep 27 2020 @ 11:46AM

బిగ్‌బాస్‌ షోలో అనుష్క..?

Kaakateeya

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ షోలో ఆదివారం టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి సందడి చేయనున్నారా? అంటే అవుననే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకూ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను అనుష్క ఎందుకు కలవాలని అనుకుంటున్నారు. తన సినిమా నిశ్శబ్దం ప్రమోషన్స్‌ కోసం. అనుష్క తొలిసారి దివ్యాంగురాలి పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' యూనిట్‌తో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తే కావాల్సినంత ప్రమోషన్స్‌ దక్కినట్లేనని మేకర్స్‌ భావిస్తున్నారట. మాధవన్‌, అంజలి, షాలిని పాండే, అండ్రూహడ్సన్‌ తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 


Advertisement
Advertisement
Advertisement