Anushka Sharma : నేను నటినో, తల్లినో మాత్రమే కాదు... అంతకు మించి!

ఏ స్త్రీకైనా మాతృత్వం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. ప్రతీ భార్యా తన జీవితాన్ని ‘తల్లి అవ్వక ముందు’, ‘తల్లి అయ్యాక’ అన్నట్టుగా విభజించుకుని చూసుకుంటుంది. ఇందుకు గ్లామర్ ప్రపంచంలో మునిగితేలే కథనాయికలు కూడా మినహాయింపు కాదు. ఎంతటి టాప్ హీరోయిన్ అయినా తల్లి అయ్యాక ఎంతో మార్పుకు లోనవుతుంది. అనుష్క శర్మ కూడా అదే చెబుతోంది... 


ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన అనుష్క గత జనవరిలో ఓ అందాల పాపాయికి తల్లి కూడా అయింది. గారాల వారసురాలు ‘వామికా’ జన్మించాక, తన జీవితంలో ఎన్నో మార్పులు కలిగాయంటోన్న ఆమె, వ్యక్తిగా కూడా మానసిక స్థాయిలో ఎంతో పరిణతి చెందానని చెప్పింది. అయితే, తాను ఒక నటిని, అలాగే ఒక తల్లిని కూడా అంటోంది అనుష్క శర్మ. ఆ రెండూ తన జీవితంలోని చాలా భాగాన్ని ఖర్చు చేస్తేనే సాధ్యం అయ్యాయట. అందుకే ‘నటి, తల్లి’ అనే రెండూ పార్శ్వాలు అమూల్యమైనవే అని చెప్పింది. కాకపోతే, ‘యాక్టర్, మదర్’ ఈ రెండిట్లో ఏ పదమూ తనని పూర్తిగా నిర్వచించలేదని కూడా అనుష్క చెప్పింది. తాను ఒక నటి, ఒక తల్లి కంటే ఎక్కువని అని ఆమె వివరించింది.  

Advertisement