మహిళల్ని శక్తిమంతంగా చూపించాలనే

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

నిర్మాతగా మారి విజయాలు అందుకుంటున్న కథానాయికల జాబితాలో అనుష్కా శర్మ ఒకరు. ఆమె తన సోదరుడు కర్నేష్‌ శర్మతో కలిసి నిర్మించిన ‘బుల్‌బుల్‌’ వెబ్‌ సినిమా ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది...

మహిళల్ని శక్తిమంతంగా చూపించాలనే

నిర్మాతగా మారి విజయాలు అందుకుంటున్న కథానాయికల జాబితాలో అనుష్కా శర్మ ఒకరు. ఆమె తన సోదరుడు కర్నేష్‌ శర్మతో కలిసి నిర్మించిన ‘బుల్‌బుల్‌’ వెబ్‌ సినిమా ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ‘సూపర్‌ నేచురల్‌ డ్రామా’గా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ‘కథ చెప్పడం అనేది మహిళలు, వారి విజయాల గురించి ఉండాలి. సినిమా ద్వారా మేము ఎల్లప్పుడూ శక్తిమంతమైన, స్వతంత్ర భావాలున్న మహిళలను ఆవిష్కరించాలనుకుంటాం. ‘బుల్‌బుల్‌’ కూడా అలాంటి ప్రయత్నమే.


‘బుల్‌బుల్‌’కు వస్తున్న ప్రేక్షకాదరణ చూసి సంతోషం కలుగుతుంది. మన సినిమాల్లో చాలాసార్లు మహిళలను తక్కువ చేసి చూపించడమే కాకుండా వారి పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒక నటిగా నాకూ ఇలాంటివి అనుభవమే. నేను నిర్మించే సినిమాల ద్వారా సాధ్యమైనంత వరకూ ఈ ధోరణిని సరిదిద్దాలనుకున్నా’’ అని చెబుతారు అనుష్కా శర్మ. గత నెలలో అనుష్క, కర్నేశ్‌ నిర్మించిన ‘పాతాల్‌ లోక్‌’ (అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘రబ్‌నే బనాది జోడీ’, బ్యాండ్‌ బజావో భారత్‌’, ‘పీకే’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ‘ఎన్‌ హెచ్‌ 10’ సినిమాతో నిర్మాతగా మారారు.


Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST