Abn logo
Sep 21 2020 @ 04:23AM

అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

Kaakateeya

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా  మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్‌ మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి  మాట్లాడాలని.. అనురాగ్‌ ఇంటికి పిలిచారు. మరుసటి రోజు ఇంటికెళ్లేసరికి ఆయన మధ్యం సేవించి ఉన్నారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు కూడా అనిపించింది. నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. నా దుస్తులు విప్పి బలాత్కరించబోయారు. నేను తిరస్కరించగా ‘ఇక్కడ ఇవన్నీ సాధారణమే నేను ఫోన్‌ చేస్తే రిచా చద్దా, హ్యుమా ఖురేషి, మహిగిల్‌ లాంటి నాయికలు వచ్చి నాతో గడుపుతారు’ అని చెప్పారు. ‘బాంబే వెల్వెట్‌’ చిత్రీకరణ సమయంలో ఇదంతా జరిగింది. రణబీర్‌ సినిమాలో అవకాశం కోసం ఏ అమ్మాయి అయినా తనతో సన్నిహితంగా ఉండేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన నాతో చెప్పారు. ‘మీటూ’ ఉద్యమం సమయంలోనే బయటకు వచ్చి అనురాగ్‌ కశ్యప్‌ గురించి చెప్పాలనుకున్నా. అనురాగ్‌ వేధిస్తున్నాడని అప్పుడే ట్వీట్‌ చేశా. దర్శకుడిపై ఈ తరహా ఆరోపణలు చేేస్త అవకాశాలు రావని కొందరు చెప్పడంతో ట్వీట్‌ డిలీట్‌ చేశా. దాంతో అనురాగ్‌ నన్ను వాట్సా్‌పలో బ్లాక్‌ చేశాడు. మనసులో బాధ పోగొట్టుకోవడానికే ఇప్పుడు ఈ విషయాలను బయటపెట్టా’’ అని పాయల్‌ ఘోష్‌ తెలిపారు. దర్శకుడిపై చేసిన ఆరోపణలతో తనకు ప్రాణహాని ఉందని పాయల్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు పీఎంవోని ట్యాగ్‌ చేస్తూ ‘నరేంద్రమోదీ జీ.. దయచేసి నాకు సాయం చేయండి. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోగలరు’ అని ఆమె ట్విట్టర్‌లో రాశారు. దీనికి కంగనా రనౌత్‌ స్పందించి ఆమెకు మద్దతుగా నిలిచారు. అనురాగ్‌ను అరెస్ట్‌ చేయాలని కంగనా డిమాండ్‌ చేశారు. 

ఎంత నిజముందో చూద్దాం: అనురాగ్‌ కశ్యప్‌

పాయల్‌ ఘోష్‌ చేసిన ఆరోపణలపై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు. పాయల్‌ చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఆమె వ్యాఖ్యలతో చాలా మంది నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌, మెేస్సజ్‌లు వచ్చాయని, ఆ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ మాట్లాడడానికి ముందుకొచ్చానని అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘పాయల్‌ నన్ను మాట్లాడకుండా చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఒక మహిళ అయుండి నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయని ఆరోపణలు చేయడం మీకు తప్పుగా అనిపించడం లేదా? ప్రతిదానికీ హద్దులుంటాయి. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పడానికే నేను స్పందించా. ఈ క్రమంలో బచ్చన్‌ కుటుంబాన్ని, కొందరు హీరోయిన్‌లను ఇందులోకి లాగడానికి ప్రయత్నించి మీరు విఫలమయ్యారు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకోవడం నేరమంటే ఆనందంగా ఒప్పుకుంటాను. దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్స్‌తో మాట్లాడుతుంటాను. కానీ, ఎప్పుడూ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించలేదు. మీరు ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్థముందో భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది’ అని అనురాగ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన భార్య ఆర్తీ బజాజ్‌, తాప్సీ, అనుభవ్‌ సిన్హా, టిస్కా చోప్రా, సుర్వీన్‌ చావ్లా అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు.

Advertisement
Advertisement
Advertisement