అనురాగ ‘బంధం’

ABN , First Publish Date - 2022-08-13T04:05:59+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

అనురాగ ‘బంధం’
కాగజ్‌నగర్‌లో సీఎం చిత్రపటానికి రాఖీ కడుతున్న మహిళలు

- జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు 

- పలు చోట్ల ముఖ్యమంత్రి చిత్రపటాలకు రాఖీ కట్టిన మహిళా నాయకులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/రెబ్బెన/కౌటాల/దహెగాం/తిర్యాణి/బెజ్జూరు/కెరమెరి/జైనూరు/సిర్పూర్‌(యూ)/వాంకిడి, ఆగస్టు 12: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాఖీ, స్వీటు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు రాఖీ కట్టారు. అలాగే సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీ కట్టి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌ ప్రత్యేక సబ్‌ జైలులో రక్షా బంధన్‌ను ఘనంగా నిర్వహించారు.  కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన పలువురు మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టారు. స్థానిక త్రినేత్ర ఆలయంలో వేద పండితులు ముద్దు నరహరి శర్మ, రాజేంద్రప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో యజ్ఙోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెబ్బెన మండల కేంద్రంలోఎంపీపీ సౌందర్యతో పాటు పలువురు మహిళలు కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టారు.   కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌, సర్పంచిలు అహల్యాదేవి, వినోద, మధునయ్య, సంజీవ్‌, మహేష్‌, మధునయ్య, శ్రీను, అన్నపూర్ణ, అరుణ, ఆలయ ఛైర్మన్‌ వెంకటచారి, శ్రీధర్‌,మురళి, వినోద్‌ జైస్వాల్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కౌటాల మండలంలో దూర ప్రాంతాల నుంచి అన్నతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు వస్తుండడంతో సందడి నెలకొంది. దహెగాం మండలంలో రాఖీ పండుగ సందర్భంగా సందడి నెలకొంది. తిర్యాణి టీఆర్‌ఎస్‌ నాయకుడు జగదీష్‌ ఆద్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగం నాయకులు రాఖీలు క్టారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు, టీచర్లకు రాఖీలు కట్టారు.  కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌లు రుక్మిణి, సింధుజ, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌, శంకర్‌గౌడ్‌, లచ్చన్న, రాజయ్య, మల్లేష్‌, రాజయ్య, తిరుపతి, శంకర్‌, హనుమండ్ల జదీష్‌, బ్రహ్మం, వైస్‌ ప్రిన్సిపాల్‌ రేణుక తదితరులు ఉన్నారు. బెజ్జూరు మండలంలో సోదరులకు సోదరీలు రాఖీ కట్టి అప్యాయతను పంచుకున్నారు.  కేజీబీవీ పాఠశాలలో రక్షా బంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ పర్వీన్‌సుల్తానా, నాయకులు నరేందర్‌గౌడ్‌, జాహీద్‌, జావీద్‌, సుగుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కెరమెరి మండల వ్యాప్తంగా ప్రజలు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. జైనూరు, ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీపీ కుంర తిరుమల, సర్పంచ్‌లు మేస్రాం పార్వతీబాయి, కనక ప్రతిభ తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్ర పటానికి రాఖీలు కట్టారు.  స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉపాధ్యాయులు మండల ప్రజా ప్రతినిధులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతీయాజ్‌లాలఖాన్‌, ఎంపీడీవో ప్రభుదయ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్‌(యూ)మండల కేంద్రంలో సర్పంచ్‌ ఆత్రం పధ్మబాయి, ఆర్క హిరాబాయి ఎంపీటీసీ గెడం సార్జబాయి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీ కట్టారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు,వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌,, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు తదితరులు పాల్గొన్నారు. వాంకిడి మండలంలో రాఖీ దుకాణాల్లో  కొనుగోలుదారులతో  సందడి నెలకొంది.  మండల కేంద్రంలో కేసీఆర్‌ చిత్రపటానికి ఎంపీపీ ముండే విమలాబాయి రాఖీ కట్టారు.

Updated Date - 2022-08-13T04:05:59+05:30 IST