Abn logo
Apr 10 2020 @ 17:20PM

ఫేక్ ఫొటోపై అనుపమ సీరియస్!

`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ `అఆ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే గ్లామర్‌కు దూరంగా సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో మాత్రమే కనిపించడానికి ఇష్టపడే అనుపమకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం అనుపమకు పెద్దగా అవకాశాలు లేవు. 


తాజాగా అనుపమకు సంబంధించిన ఓ గ్లామరస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది ఫేక్ ఫొటో అని, తనది కాదని చెబుతూ ఒరిజినల్ ఫొటోను షేర్ చేసింది అనుపమ. `ఇలాంటి చెత్త పనులు చేసేందుకు సమయం దొరుకుతుంది. దయచేసి ఇలాంటి ఫేక్ ఫొటోలను వైరల్ చెయ్యొద్దు. ఇవి చాలా బాధ పెడతాయ`ని అనుపమ పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement