Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 15:13:41 IST

Anupama parameswaran: జక్కన్న కాళ్లపై పడిన మలయాళ బ్యూటీ!

twitter-iconwatsapp-iconfb-icon

మలయాళ అందం అనుపమా పరమేశ్వరన్‌ (Anupama paramswaran) రాజమౌళి (Raja mouli)కాళ్లకు నమస్కరించి ఆశీసులు తీసుకున్నారు. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో రాజమౌళిని పలకరించి బ్లెసింగ్స్‌ కోరారు అనుపమా. నిఖిల్‌ సరసన ఆమె కథానాయికగా నటించిన ‘కార్తికేయ 2’(Karthikeya 2) చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్ర బృందంతో కలిసి హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ప్రేక్షకుల మధ్య సినిమాను వీక్షించారామె! రాజమౌళి–రమా(Rama rajamouli), కీరవాణి కుటుంబ సభ్యులు అదే థియేటర్‌లో సినిమా చూశారు. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి అండ్‌ టీమ్‌ కార్‌ పార్కింగ్‌ ఏరియాలో ఉండగా అనుపమా అక్కడికి చేరుకున్నారు. రాజమౌళిని చూసిన వెంటనే ఆయన కాళ్లకు నమస్కరించారు. సినిమా చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జక్కన అనుపమాను అభినందించారు. ‘సినిమా నచ్చింది. ముగ్ధ పాత్రకు న్యాయం చేశావు’ అంటూ కితాబిచ్చారు. ఈ మొత్తాన్ని అభిమానులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘కార్తికేయ’ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement