Abn logo
Oct 18 2020 @ 22:13PM

నిఖిల్‌ 18 పేజెస్‌కి హీరోయిన్‌ ఫిక్సయింది

Kaakateeya

యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న 18 పేజెస్‌ చిత్రంలో హీరోయిన్‌ ఫిక్సయింది. అనుపమ పరమేశ్వరన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అంటూ చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా ఈ చిత్ర హీరోయిన్‌ విషయంలో కన్ఫ్యూజన్‌ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ అంటూ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినబడ్డాయి. ఆఖరికి అనుపమ పరమేశ్వరన్‌ పేరు కూడా వినబడింది కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు చిత్రయూనిట్‌ అధికారికంగా అనుపమ పరమేశ్వరనే మా హీరోయిన్‌ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

సుకుమార్‌, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్‌ చిత్రాన్ని కుమారి 21 ఎఫ్‌ ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం చేయనున్నారు. ఈ చిత్రంలో నిఖిల్‌ను సరికొత్తగా చూపించనున్నారని తెలుస్తుంది.


Advertisement
Advertisement
Advertisement