Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 09:44:23 IST

Anupama Parameswaran: క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్..?

twitter-iconwatsapp-iconfb-icon

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) సరసన హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. కెరీర్ మధ్యలో కాస్త బ్రేక్ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటోంది. ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలో నటించి హిట్ అందుకున్న అనుపమ బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil) సరసన రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. వీటిలో ఒకటి కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 (Karthikeya 2) కాగా, మరొక చిత్రం 18 పేజెస్ (18 Pages). 

నేడు కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే, మూవీ హిట్ టాక్ ని కూడా తెచ్చుకుంది. ఇక 18 పేజెస్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు నెట్టింట ఓ వార్త బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ..ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్‌లో నటించబోతున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు (DJ Tillu) బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పెద్ద సినిమాలు ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్ళను రాబట్టింది. 

నేహ శెట్టి అందచందాలు, సిద్ధు జొన్నలగడ్డ మాస్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే, ఈ సినిమా సీక్వెల్‌లోనూ సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా నేహ శర్మ నటిస్తుందనుకున్నారు. కానీ, ఆ అవకాశం అనుపమకి దక్కిందని అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే వార్త వైరల్ అవుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement