Abn logo
Jun 5 2020 @ 09:02AM

‘కార్తికేయ 2’ నుండి అనుప‌మ ఔట్‌..!

హీరో నిఖిల్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒక‌టి. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ట‌. త‌న పాత్ర‌కు అంత ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో అనుప‌మ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌ర్శ‌క నిర్మాత‌లిప్పుడు మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌. 

Advertisement
Advertisement
Advertisement