అనూకు ఒక్కటన్నా పడాల్సిందే..!

అను ఇమ్మాన్యుయేల్ నాని నటించిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమా నుంచే అమ్మడికి ఏ సినిమా చేసినా అంతగా కలిసి రావడం లేదు. ఇండస్ట్రీకొచ్చి ఆరేడేళ్లు అవుతున్నా ఇప్పటివరకు సాలీడ్ హిట్ అంటూ ఒక్కటి కూడా తన ఖాతాలో చేరలేదు. దాంతో రేస్‌లో బాగా వెనకబడింది. ఇటీవల వచ్చిన 'మహా సముద్రం' సినిమా మీద అను ఇమ్మాన్యుయేల్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయి ఉంటే ఊపు మరోలా ఉండేదేమో. కానీ, ఆశించిన సక్సెస్ 'మహా సముద్రం' ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. అందుకే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో అభిమానులకు, మేకర్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సందడి చేస్తోంది. ఇప్పుడు అంతా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. అనూ కూడా అదే బాటలో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే కాస్త బోల్డ్‌గా ఉన్న లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుందట. చూడాలి మరి అను ఇమ్మాన్యుయేల్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.

Advertisement