Apr 23 2021 @ 13:43PM

'జాతిర‌త్నాలు' అమెరికా వెళితే..!

ఈ మ‌ధ్య కాలంలో లో బ‌డ్జెట్ మూవీగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రం `జాతి ర‌త్నాలు`. న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియదర్శి కాంబినేషన్‌లో రూపొందిన ఈ హిలేరియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద న‌ల‌బై కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. డైరెక్ట‌ర్ అనుదీప్ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పొట్ట‌కూటి కోసం ముగ్గురు స్నేహితులు హైద‌రాబాద్ వ‌స్తే ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో జాతిర‌త్నాలు రూపొందితే, అదే ముగ్గురు స్నేహితులు అమెరికా వెళ్తే ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో జాతిర‌త్నాలు సీక్వెల్ ఉంటుంద‌ని టాక్‌. అయితే ఈ సీక్వెల్ కంటే ముందు, అనుదీప్ మ‌రో సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ట‌. త‌ర్వాతే సీక్వెల్ ప్లాన్ చేస్తాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.