Sep 23 2021 @ 10:35AM

రామ్ చరణ్ వదిలిన 'అనుభవించు రాజా' టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అనుభవించు రాజా'. తాజాగా చిత్ర టీజర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో రాజ్ తరుణ్ మేకోవర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలంటే కాస్త భిన్నంగా ఉంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా 'అనుభవించు రాజా' రూపొందిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్‌కి ఈ సినిమా గ్యారెంటీగా హిట్ ఇచ్చేలానే ఉందనిపిస్తోంది. కాశీష్ ఖాన్, పోసాని కృష్ణమురళి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకుడు.