Sep 23 2021 @ 18:53PM

Ram charan: బంగారం గాడి పుంజు బరిలో ఉండగా...

రాజ్‌ తరుణ్‌ హీరోగా  శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కింగ్‌ నాగార్జున రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! గురవారం మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ టీజర్‌ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అనుభవించు రాజా’ టీజర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. చాలా ఎంజాయ్‌ చేశాను’’ అని చరణ్‌ అన్నారు. ‘‘భీమవరంలో కోడి పందెం సెటప్‌ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో మొదలైన టీజర్‌ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. విలాసాలకు అలవాటు పడి జూదగాడిగా తనదైన స్టైల్లో కనిపించారు రాజ్‌తరుణ్‌. పందెం కాయడం, బెట్టింగ్‌ వేయడం, గ్యాంబ్లింగ్‌ చేయడం, పేకాట ఆడటం, రికార్డింగ్‌ డ్యాన్సులు చేయడం వంటి మాస్‌ ఎలిమెంట్స్‌ ఈ టీజర్‌లో కనిపిస్తున్నాయి. 

‘‘అయినా బంగారం గాడు ఊర్లో.. ఆడి పుంజు బరిలో ఉండగా.. ఇంకొకడు గెలవడం కష్టం...’’ అని మీసాలు తిప్పుతూ రాజ్‌ తరుణ్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ సరసన కాశిష్‌ ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.