యంగ్ హీరో రాజ్ తరుణ్, కశీష్ ఖాన్ జంటగా నటించిన సినిమా 'అనుభవించు రాజా'. ఈ సినిమా ఇటీవల థియేట్రికల్ రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడి ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇందులో రాజ్ తరుణ్ ఊరిలో ఆవారాగా తిరిగే బంగార్రాజుగా అలాగే సిటీలో సిన్సియర్‌గా సెక్యూరిటీ ఉద్యోగం చేసేవాడిగానూ రెండు డిఫరెంట్ రోల్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. కాగా, ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.