ఏఎన్‌యూ క్రీడా క్యాలెండర్‌ విడుదల

ABN , First Publish Date - 2021-12-01T06:11:04+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి క్రీడా క్యాలెండర్‌ను మంగళవారం వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ విడుదల చేశారు.

ఏఎన్‌యూ క్రీడా క్యాలెండర్‌ విడుదల

పెదకాకాని, నవంబరు 30: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి క్రీడా క్యాలెండర్‌ను మంగళవారం వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ విడుదల చేశారు.  జాతీయ స్థాయిలో జరగనున్న అంతర్‌ విశ్వవిద్యాలయ పోటీలకు విశ్వ విద్యాలయ జట్లు, అంతర్‌ కళాశాలల పోటీల నిర్వహణకు విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలలను ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో అంతర్‌ విశ్వ విద్యాలయాల మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలను ఈనెల చివర్లో నిర్వహిస్తామన్నారు. 2022 జనవరి చివరి వారంలో పురుషుల సాఫ్ట్‌బాల్‌ పోటీలు నిర్వహించేందుకు తీర్మానించారు. సమావేశంలో రెక్టార్‌ ఆచార్య ప్రొఫెసర్‌ పి.వరప్రసాద్‌మూర్తి, రిజిస్ర్టార్‌ ఆచార్య బి.కరుణ, ప్రిన్సిపాల్‌ కుమార్‌, వర్సిటీ పీడీ పి.జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-01T06:11:04+05:30 IST