20న వర్సిటీలో వార్షిక స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2022-08-18T06:01:15+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 20వ తేదీన 37, 38 వార్షిక స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైఎస్‌ చాన్సలర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ తెలిపారు.

20న వర్సిటీలో వార్షిక స్నాతకోత్సవం
వర్సిటీలో స్నాతకోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు

ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్‌వీ రమణ రాక

డాక్టరేట్‌ ప్రదానం చేయనున్న గవర్నర్‌

పెదకాకాని, ఆగస్టు 17: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 20వ తేదీన 37, 38 వార్షిక స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైఎస్‌ చాన్సలర్‌ ఆచార్య పి.రాజశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ చాన్సలర్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. 

 

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ 

స్నాతకోత్సవ ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పరిశీలించారు. ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్ల వివరాలను చర్చించారు. కార్యక్రమంలో సీఎం అడిషనల్‌ సెక్రటరీ ముత్యాలరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, వర్సిటీ ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌, ప్రొటోకాల్‌ డీడీ శర్మ, గుంటూరు ఆర్డీవో ప్రభాకరరెడ్డి, తహసీల్దార్లు రత్నకుమార్‌(పెదకాకాని), రాంప్రసాద్‌(మంగళగిరి) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:01:15+05:30 IST