ఏఎనయూ ఇనచార్జి రిజిస్ర్టార్‌గా డాక్టర్‌ కరుణ

ABN , First Publish Date - 2021-07-25T05:32:26+05:30 IST

ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం ఇనచార్జి రిజిసా్ట్రర్‌గా ఇంగ్లిష్‌ డిపార్టుమెంటుకు చెందిన సీనియర్‌ సహ ఆచార్యులు డాక్టర్‌ బి.కరుణ నియమితులయ్యారు.

ఏఎనయూ ఇనచార్జి రిజిస్ర్టార్‌గా డాక్టర్‌ కరుణ

వర్సిటీ చరిత్రలో మొదటి మహిళా రిజిసా్ట్రర్‌ 

పెదకాకాని, జూలై 24: ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం ఇనచార్జి రిజిసా్ట్రర్‌గా ఇంగ్లిష్‌ డిపార్టుమెంటుకు చెందిన సీనియర్‌ సహ ఆచార్యులు డాక్టర్‌ బి.కరుణ నియమితులయ్యారు. ప్రస్తుత ఇనచార్జి రిజిస్ర్టార్‌గా వ్యవహరిస్తున్న ఆచార్య కె రోశయ్య ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండడంతో ఈ నియామకం చేపట్టారు. వర్సిటీ చరిత్రలో తొలి మహిళా రిజిస్ర్టార్‌గా డాక్టర్‌ కరుణ నిలుస్తారు. ఈ మేరకు ఆమెకు నియామకపత్రాన్ని వైస్‌చాన్సలర్‌ పి.రాజశేఖర్‌ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, కో ఆర్డినేటర్లు, డైరెక్టర్లు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఆచార్య రాజశేఖర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి మహిళాసాధికారతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని విశ్వవిద్యాలయంలో మూడు అత్యున్నత పదవుల్లో ఒకటి అయిన రిజిసా్ట్రర్‌ పదవిని మహిళకు కేటాయిస్తున్న నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 31న ఇనచార్జి రిజిస్ర్టార్‌గా కరుణ పదవీ బాధ్యతలు చేపడతారన్నారు. రిజిస్ర్టార్‌ ఆచార్య కె.రోశయ్య మాట్లాడుతూ తన పదవీ కాలంలో సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో  రెక్టార్‌  ఆచార్య పి.వరప్రసాద్‌, ఆచార్య శ్రీనివాసరెడ్డి, ఆచార్య ప్రమీలారాణి, ఆచార్య పి.సిద్దయ్య, ఈసీ మెంబర్స్‌ ఆచార్య సరస్వతి రాజు అయ్యర్‌, డాక్టర్‌ మధుబాబు, డాక్టర్‌ బట్టు నాగరాజు, ఆచార్య ఉదయకుమార్‌, డాక్టర్‌ హరిబాబు, డాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్‌ భవనం నాగకిషోర్‌, డి.నరసారెడ్డి, జి. పుల్లారావు, కావూరి శ్రీనివాసరావు తదితరులు హజరయ్యి డాక్టర్‌ కరుణకు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-07-25T05:32:26+05:30 IST