Abn logo
Mar 27 2020 @ 10:43AM

నిఖిల్ చిత్రంలో బ‌న్నీ హీరోయిన్‌..!

Kaakateeya

నాని ‘మ‌జ్ను’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అను ఇమ్మాన్యుయేల్ మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంది. బ‌న్నీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, చైత‌న్య‌తో ‘శైల‌జారెడ్డి అల్లుడు’ చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు చిత్రాలు అను ఇమ్మాన్యుయేల్‌కి పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో అమ్మ‌డుకి అవ‌కాశాలు క‌నుమ‌రుగ‌య్యాయి. ఈ క్ర‌మంలో లేటెస్ట్ స‌మాచారం మేర‌కు నిఖిల్ హీరోగా రూపొందుతోన్న 18 పేజెస్ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. కొన్ని రోజుల క్రితం క్రితిశెట్టి పేరు విన‌పడ్డ‌ప్ప‌టికీ అను ఇమ్మాన్యుయేల్‌కే మేక‌ర్స్ మొగ్గు చూపార‌ట‌. ప్ర‌స్తుతం అనుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ తెర‌కెక్కించ‌నున్నఈ చిత్రానికి సుకుమార్ క‌థ‌, మాట‌లు అందిస్తార‌ని టాక్‌.

Advertisement
Advertisement
Advertisement