వైభవంగా స్వామివారి చక్రస్నానం

ABN , First Publish Date - 2021-02-28T07:05:21+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం స్వామికి చక్రస్నానం నిర్వహించారు.

వైభవంగా స్వామివారి చక్రస్నానం
తీరాన్ని తాకిన భక్త జన సందోహం

అంతర్వేది, ఫిబ్రవరి 27: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం స్వామికి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ఆలయంవద్దనుంచి అలంకార మండపంలో పూజలందుకున్న స్వామిని రుద్రరాజు బంగారమ్మ బహూకరించిన గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.  పల్లకిలో సుదర్శన చక్రధారుడైన పెరుమాళ్‌స్వామిని మంగళవాయిద్యాల నడుమ సముద్ర తీరానికి తీసుకువెళ్లారు. అక్కడ స్వామికి, చక్రపెరుమాళ్‌ స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, పెద్దింటి జగన్నాథచార్యులు, స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితులు చింతావేంకటశాస్త్రి, పేరూరు ఉద్దండ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, డీఎస్పీ మాధవరెడ్డి, ఆలయ చైర్మన్‌, ఫ్యామిలీ ఫౌండర్‌ రాజగోపాలరాజాబహుద్దూర్‌, మాజీ ఎంపీటీసీ వాసు, వలవల రాంబాబు, తహశీల్దార్‌ రమాకుమారి, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌, పోతురాజు శ్రీవేంకటకృష్ణ, సీఐ దుర్గాశేఖరరెడ్డి, ఎస్‌ఐలు గోపాలకృష్ణ, నాగరాజు, శ్రీనివాస్‌, వాహనకారులు, భక్తులు పాల్గొన్నారు. తొలుత పేరూరు ఉద్దండ పండితుల శిరస్సుపై శ్రీచక్రపెరుమాళ్‌ను ఉంచి సముద్రస్నానం చేయించారు. భక్తులు, అగ్నికుల క్షత్రియులు పున్నమిస్నానాలు ఆచరించారు. కొవిడ్‌ నేపథ్యంలో జల్లుస్నానం రద్దుచేయడంతో భక్తులు సముద్రంలోనే స్నానాలు ఆచరించారు. స్వామి, చక్రపెరుమాళ్‌ను వసంత మండపానికి అర్చకులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. స్వామికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదం పంచారు. రాత్రి అర్చకులు ధ్వజారోహణ నిర్వహించారు.

Updated Date - 2021-02-28T07:05:21+05:30 IST