వైభవంగా లక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-26T06:12:49+05:30 IST

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణో త్సవాల్లో భాగంగా ఏడోరోజు గురువారం హనుమద్‌ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. అంతర్వేదిపాలేనికి చెందిన అల్లూ రి వెంకటసత్యనారాయణరాజు సహకారంతో నిర్మితమైన హనుమద్‌ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది.

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవాలు
హనుమద్‌ వాహనంపై స్వామి గ్రామోత్సవం

అంతర్వేది, ఫిబ్రవరి 25: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణో త్సవాల్లో భాగంగా ఏడోరోజు గురువారం హనుమద్‌ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. అంతర్వేదిపాలేనికి చెందిన అల్లూ రి వెంకటసత్యనారాయణరాజు సహకారంతో నిర్మితమైన హనుమద్‌ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. తొలుత స్వామివారి వాహనశాలవద్ద నూతన వధూవరులైన స్వామి,అమ్మవార్లను వాహ నంపై అధిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహన నిర్మాతలు, అధికారులు, అర్చకులు, భక్తులు కొబ్బరికాయలు కొట్టి వాహన గ్రామోత్సవంలో పాల్గొన్నారు. రాత్రి 7గంటలకు సింహ వాహ నంపై గ్రామోత్సవం నిర్వహించారు. శృంగవరప్పాడుకు చెందిన రావి లక్ష్మణరావు సహకారంతో నిర్మించిన సింహ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సహాయకమిషనర్‌ యర్రంశెట్టి భధ్రాజీ, వలవల రాంబాబు, దాసరి వాసు పాల్గొన్నారు.

నేడు రాజాధిరాజా.. అశ్వవాహనాలపై గ్రామోత్సవం

లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం సా యంత్రం 4 గంటలకు స్వామివారు రాజాధిరాజా వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగనున్నారు. అనంతరం 6గంటలకు ధూపసేవ, 7గం టలకు అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్న ట్టు ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. 

ప్రిన్సిపల్‌ కార్యదర్శి విశ్వజిత్‌ పూజలు

కల్యాణోత్సవాల్లో భాగంగా హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి విశ్వజిత్‌ అంతర్వేది ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో దర్శనం నిర్వహించి వేదపండితులతో మహాదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను, చరిత్రను ఆయనకు అర్చకస్వాములు వివరించారు.

Updated Date - 2021-02-26T06:12:49+05:30 IST