యూపీలో మతమార్పిడి నిరోధక చట్టం

ABN , First Publish Date - 2020-09-19T07:42:39+05:30 IST

రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తోంది. లవ్‌ జిహాద్‌ పేరుతో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న

యూపీలో మతమార్పిడి నిరోధక చట్టం

కసరత్తు చేస్తున్న న్యాయ మంత్రిత్వ శాఖ


లఖ్‌నవూ, సెప్టెంబరు 18: రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తోంది. లవ్‌ జిహాద్‌ పేరుతో రాష్ట్రంలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న కారణంతో   ఈ చట్టానికి రూపకల్పన చేస్తోంది.


‘‘ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న మతమార్పిడుల చట్టాలను అధ్యయనం చేస్తున్నాం. స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వస్తాం’’ అని యూపీ న్యాయ మంత్రిత్వ శాఖలోని ఓ కీలక అధికారి వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో(ఒడిసా, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌)మత మార్పిడి నిరోధక చట్టాలున్నాయని, త్వరలోనే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌కూడా చేరుతుందని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.


Updated Date - 2020-09-19T07:42:39+05:30 IST