Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

కొత్తచెరువు, అక్టోబరు 14: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి సూచించారు. గురు వారం మండల పరిధిలోని మీర్జాపురం గ్రామంలో యల్లమ్మగుడి ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేశారు. ఈ గుడి అభివృద్ధిఽ కోసం రూ.50వేలు విరాళాన్ని ఇటీవలే గ్రా మస్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గుడిలో పూజలు నిర్వహించి అనంతరం  అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇండ్లవెంకటంపల్లి, కొడపగానిపల్లి గ్రామాలలో పర్యటించి ఇటీవల మృతిచెందిన ఓబుళపతి, మల్లేశ్‌ కుటుంబ సభ్యు లను పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ...  పని చేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపునిస్తూ పదవులు ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ కష్టించి పనిచే యాలన్నారు. ఈ కార్యక్రమంలో పా ర్లమెంట్‌ అధికారప్రతినిధి సాలక్క గారి శ్రీని వాసులు, మండల కన్వీనర్‌ రామక్రిష్ణ,  ఒలిపి శ్రీనివాసులు, నాయకులు రా జప్ప, పార్లమెంట్‌ తెలుగుయువత కార్యదర్శి షర్పుద్దీన్‌, మండల ఉపాధ్యక్షుడు చాకలి సుబ్బరాయుడు, చికెన్‌ సెంటర్‌ నాగేంద్ర,  అంజి న్‌రెడ్డి, కొడపగానిపల్లిశివ, మౌ ళాలి, శ్రీరాములు, ఆదెప్ప పాల్గొన్నారు.


Advertisement
Advertisement