స్పామ్‌ కాల్స్‌కు విరుగుడు

ABN , First Publish Date - 2022-05-21T06:58:04+05:30 IST

మీకు తెలియని(అన్‌ నోన్‌) నంబర్లను మొదట ఎంపిక చేసుకోండి. ఇందులో ఒక ఇబ్బంది ఉంది. అలాంటి వాటిలో కొన్ని పనికొచ్చే నంబర్లూ ఉంటాయి.

స్పామ్‌ కాల్స్‌కు విరుగుడు

స్పామ్‌ అలాగే స్కామ్‌ కాల్స్‌కు ఈ రోజుల్లో అంతూపొంతూ లేదు. ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ మొదలుకుని అప్పుల ఆఫర్లు, ప్లాట్లు... ఒకటనేమిటి సర్వం ఒక్క కాల్‌తో చేసేద్దామనే యావ పెరిగింది. స్పామ్‌ కాల్స్‌ చేసే వ్యక్తులను స్పామర్స్‌ అంటారు. వీరిలో రోజూ కాల్‌ చేసి వేధించే వ్యక్తులు వేర్వేరు నంబర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్‌లో ఈ స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేసే ఉపాయం ఉంది. అదేమిటంటే...


మీకు తెలియని(అన్‌ నోన్‌) నంబర్లను మొదట ఎంపిక చేసుకోండి. ఇందులో ఒక ఇబ్బంది ఉంది. అలాంటి వాటిలో కొన్ని పనికొచ్చే నంబర్లూ ఉంటాయి. అలాంటి వాటిని ఈ ట్రిక్‌లో కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అలా ముఖ్యమైన కాల్స్‌ను మిస్‌ కావచ్చు. చాలావరకు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలో గూగుల్‌ ఫోన్‌ యాప్‌ ఉంటోంది. బ్లాక్‌ ప్రాసెస్‌ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అదెలా అంటే...


ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉండే ఫోన్‌ యాప్‌ని ఓపెన్‌ చేయండి. 

రీసెంట్స్‌ టాబ్‌ వద్దకు వెళ్ళండి. 

స్పామ్‌గా రిపోర్టు చేయాలని అనుకుంటున్న కాల్‌ను టాప్‌ చేయాలి.

చివరగా బ్లాక్‌ లేదంటే రిపోర్ట్‌ స్పామ్‌ టు బ్లాక్‌ ద స్పామ్‌ కాల్‌లో ఏదో ఒకటి సెలెక్ట్‌ చేసుకోండి.

దీనికి ప్రత్యామ్నాయం అంటే థర్డ్‌ పార్టీ యాప్‌ ట్రూకాలర్‌. దీంతోనూ స్పామ్‌ కాల్స్‌ను అడ్డుకోవచ్చు. ట్రూకాలర్‌ సహాయంతో స్పామ్‌ కాలర్లను గుర్తించవచ్చు. అదంటూ ఒకసారి జరిగితే చాలు అలాంటి కాల్స్‌ను సులువుగా బ్లాక్‌ చేయవచ్చు. 

Updated Date - 2022-05-21T06:58:04+05:30 IST