15లక్షల మందికి కరోనా.. ఇటలీ అధికారుల అంచనా!

ABN , First Publish Date - 2020-08-05T04:16:30+05:30 IST

కరోనాతో తీవ్రంగా ఇబ్బందులు పడిన ఇటలీ దేశంలో ప్రకటించిన దానికన్నా భారీగానే కరోనా కేసులు ఉండి ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు.

15లక్షల మందికి కరోనా.. ఇటలీ అధికారుల అంచనా!

రోమ్: కరోనాతో తీవ్రంగా ఇబ్బందులు పడిన ఇటలీ దేశంలో ప్రకటించిన దానికన్నా భారీగానే కరోనా కేసులు ఉండి ఉండొచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. యాంటీబాడీల కోసం 65వేల మందిని పరీక్షించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు వారు చెప్పారు. వీరి అంచనాల ప్రకారం ఇటలీలో 15లక్షల మందికి లేదా 2.5శాతం జనాభాకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అధికారికంగా 2,48 లక్షల మందికి కరోనా సోకినట్లు ఇటలీ ప్రకటించింది. ఇప్పుడు పరిశోధకుల అంచనాలు నిజమైతే అధికారిక లెక్కలకన్నా ఆరురెట్ల మందికి కరోనా సోకినట్లే. ఈ యాంటీబాడీ పరీక్షలు దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేయడం కోసమే నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Updated Date - 2020-08-05T04:16:30+05:30 IST