కరోనా నుంచి కోలుకున్నవారిలో.. ఏడునెలల దాకా యాంటీబాడీలు

ABN , First Publish Date - 2020-10-25T09:40:58+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు ఏడు నెలల పాటు శరీరంలో ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) ఉంటాయని పోర్చుగల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు...

కరోనా నుంచి కోలుకున్నవారిలో.. ఏడునెలల దాకా యాంటీబాడీలు

లండన్‌, అక్టోబరు 24 : కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు ఏడు నెలల పాటు శరీరంలో ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) ఉంటాయని పోర్చుగల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న 300 మంది కరోనా రోగులు, కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న 198 మంది, 2500 మంది యూనివర్సిటీ సిబ్బందిపై జరిపిన విస్తృత అధ్యయనంలో ఈవిషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో వారందరికీ సీరాలజీ టెస్టులు నిర్వహించగా, కరోనాను తిప్పికొట్టే యాంటీబాడీలు ఏడు నెలల పాటు క్రియాశీలంగా కదలాడినట్లు వెల్లడైంది. యాంటీబాడీల సంఖ్యలో హెచ్చుతగ్గులు వయసును బట్టి కాకుండా.. ఇన్ఫెక్షన్‌ తీవ్రతకు అనుగుణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా చోటుచేసుకుంటున్నాయని గుర్తించారు. ఇన్ఫెక్షన్‌ సోకిన మొదటి మూడు వారాల తర్వాత యాంటీబాడీల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-25T09:40:58+05:30 IST