అసాంఘిక పనులకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2022-05-24T06:22:17+05:30 IST

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే, శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు.

అసాంఘిక పనులకు పాల్పడితే చర్యలు

ధవళేశ్వరం, మే 23: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే, శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు విచ్చేసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఎస్పీ శ్రీలత, సీఐ మంగాదేవి, ఎస్‌ఐలు స్వాగతం పలికారు. స్టేషన్‌లోని  లాకప్‌ రూం, వివిధ కేసుల్లో సీజ్‌ చేసి వాహనాలను, వాటి రికార్డులను, ఫిర్యా దుల రిజిస్టర్‌ను పరిశీలించిన ఎస్పీ అనంతరం సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని, నైట్‌బీట్‌లో మరింత అలెర్ట్‌గా ఉండాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లా అండ్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై పీడీయాక్ట్‌ ప్రయోగిస్తామని ఇప్పటికే ధవళేశ్వరా నికి చెందిన ముగ్గురికి జైలు శిక్ష పడిందని తెలిపారు. నేరాల అదుపునకు ప్రత్యేక పార్టీలతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

Updated Date - 2022-05-24T06:22:17+05:30 IST