వాపు తగ్గించే మందులతో కరోనాకు చెక్‌?

ABN , First Publish Date - 2020-05-29T07:33:26+05:30 IST

వాపును తగ్గించే రెండు ఔషధాలు (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటాయని తాజా అధ్యయనంలో తేలింది. వాటిలో ఒకటి మనుషులకు ఇచ్చే ఔషధం కాగా.. మరొకటి జంతువులకు వాడే మందు...

వాపు తగ్గించే మందులతో కరోనాకు చెక్‌?

లండన్‌, మే 28: వాపును తగ్గించే రెండు ఔషధాలు (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటాయని తాజా అధ్యయనంలో తేలింది. వాటిలో ఒకటి మనుషులకు ఇచ్చే ఔషధం కాగా.. మరొకటి జంతువులకు వాడే మందు. కొవిడ్‌-19పై 6466 రకాల ఔషధాల ప్రభావాన్ని కంప్యూటర్‌ టెక్నిక్స్‌ ఆధారంగా పరిశీలించిన స్పెయిన్‌ శాస్త్రజ్ఞులు.. ఈ రెండు ఔషధాలకు ఆ సామర్థ్యం ఉందని గుర్తించారు. కరోనా మన శరీరంలోకి ప్రవేశించాక తన సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. దాన్ని నిర్వీర్యం చేసే ఔషధాన్ని కనుగొనేందుకు స్పెయిన్‌లోని రొవిటా వర్సిటీ పరిశోధకులు 6466 ఔషధాలను కంప్యూటర్‌ ద్వారా పరీక్షించారు. మొత్తం ఏడు ఔషధాలకు ఆ శక్తి ఉందని వారి అధ్యయనంలో తేలింది. 


Updated Date - 2020-05-29T07:33:26+05:30 IST