‘యాంటీ’బాడీల తిరుగుబాటు వల్లే తీవ్ర ఇన్ఫెక్షన్‌

ABN , First Publish Date - 2020-09-28T13:14:13+05:30 IST

యువత, ఆరోగ్యవంతులను తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌ చుట్టుముట్టడానికి గల కారణాన్ని అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ వర్సిటీ

‘యాంటీ’బాడీల తిరుగుబాటు వల్లే తీవ్ర ఇన్ఫెక్షన్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 27 : యువత, ఆరోగ్యవంతులను తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌ చుట్టుముట్టడానికి గల కారణాన్ని అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో భాగంగా తీవ్ర ఇన్ఫెక్షన్‌తో చికిత్సపొందుతున్న 650 మంది, ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటపడని మరో 530 మంది రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి జన్యుపరీక్షలు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వారిలో పదిశాతానికిపైగా రోగుల్లో వైరస్‌ నుంచి రక్షణ కల్పించాల్సిన కొన్ని యాంటీబాడీలే.. రోగ నిరోధక వ్యవస్థపై తిరగబడుతున్నట్లు గుర్తించారు. మరో 3.5 శాతం మందిలో యాంటీబాడీలు ప్రత్యేక తరహా జన్యుమార్పులకు లోనయ్యాయని వెల్లడైంది. ఈ రెండు గ్రూపుల కొవిడ్‌ రోగుల్లోనూ 17 యాంటీబాడీ ప్రొటీన్లతో కూడిన టైప్‌-1 ఇంటర్‌ఫెరాన్‌ లోపించినట్లు తేల్చారు. 

Updated Date - 2020-09-28T13:14:13+05:30 IST