వయసు కనబడకుండా ఉండాలంటే..

ABN , First Publish Date - 2021-03-11T18:14:15+05:30 IST

అవకాడో ఫేస్‌మాస్క్‌: సగం అవకాడో, టేబుల్‌ స్ఫూన్‌ ఓట్స్‌.అవకాడోను మెత్తని పేస్ట్‌లా చేసుకొని దానికి ఓట్స్‌ కలపాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అవకాడోలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీది గీతలు, ముడతలను తొలగిస్తాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ మాస్క్‌ వేసుకోవాలి.

వయసు కనబడకుండా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(11-03-2021)

వయసు పైబడక ముందే చర్మం మీద గీతలు ఏర్పడి, వదులుగా మారడం ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. వయసును దాచేసేందుకు ఏం చేయాలంటే.... 

అవకాడో ఫేస్‌మాస్క్‌: సగం అవకాడో, టేబుల్‌ స్ఫూన్‌ ఓట్స్‌.అవకాడోను మెత్తని పేస్ట్‌లా చేసుకొని దానికి ఓట్స్‌ కలపాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అవకాడోలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీది గీతలు, ముడతలను తొలగిస్తాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ మాస్క్‌ వేసుకోవాలి.

బనానా ఫేస్‌మాస్క్‌: ఒక అరటిపండు, టీ స్పూన్‌ రోజ్‌వాటర్‌. ఒక గిన్నెలో అరటిపండును పేస్ట్‌లా చేసి రోజ్‌ వాటర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్‌మాస్క్‌లోని ఎ, ఇ విటమిన్లు చర్మాన్ని శుభ్రం చేసి కాంతినిస్తాయి. చర్మం రంగు అంతటా ఒకేలా కనిపించేటట్టు చేస్తాయి. 

రైస్‌వాటర్‌ ఫేస్‌మాస్క్‌: కప్పు రైస్‌వాటర్‌, పేపర్‌ టవల్స్‌ ఫేషియల్‌ టిష్యూ టవల్‌కు కళ్లు, ముక్కు, నోటి భాగాల్లో రంధ్రాలు చేయాలి. బియ్యం నీళ్లలో టవల్‌ను 10నిమిషాలు ఉంచి బయటకు తీసి టవల్‌లోని బియ్యం నీళ్లను పిండేయాలి. టవల్‌ను ముఖం మీద 20 లేదా 30 నిమిషాలు ఉంచి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. బియ్యం నీళ్లలోని ఫ్లేవనాయిడ్స్‌ చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఇలా రోజు చేస్తే యవ్వన చర్మం సొంతమవుతుంది.

Updated Date - 2021-03-11T18:14:15+05:30 IST